తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్కు ఆలయ సాంప్రదాయాలతో అర్చకులు స్వాగతం పలికారు.
గోపూజ నిర్వహించి శ్రీసర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదోష నందీశ్వరునికి పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
ఇదీ చదవండి:
రాయలసీమ ఎత్తిపోతలపై తెదేపా ఎమ్మెల్యేల అభ్యంతరం... సీఎం జగన్కు లేఖ!