తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పులకోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల నుంచి గర్భిణీలు వస్తుంటారు.సగటున 40 కాన్పులు జరుగుతుంటాయి. పురిటి బిడ్డలు తారుమారు కాకుండా, తల్లి నుంచి బిడ్డను దూరం చేయకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాన్ని ప్రస్తుతం తిరుపతికి విస్తరించారు.
ఇలా పనిచేస్తుంది...
కాన్పు అయిన వెంటనే తల్లితో పాటు బిడ్డ కాలికి ఒకే ఐడీతో ఉన్న ఆర్ఎఫ్ఐ ట్యాగ్లను వేస్తారు. ఆ సమయంలో అమర్చే చెప్పులకు తల్లి తాలూకు వివరాలన్నీ నమోదు చేస్తారు. తల్లి నుంచి బిడ్డను వేరు చేసేందుకు ప్రయత్నించి 5 మీటర్ల దూరం దాటితే.. వార్డు ప్రధాన ద్వారం వద్ద అమర్చిన అలారం మోగుతుంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎక్కడివారు అక్కడే ఉండేలా నియంత్రిస్తారు. అందరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పిల్లలను అపహరించినట్లు గుర్తిస్తే వెంటనే పట్టుకోవడానికి సాధ్యమవుతుందని ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి తెలిపారు. ఈ ట్యాగ్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమయంలో తల్లి బిడ్డ నుంచి తొలగిస్తారు.
ఇదీ చూడండి