తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు 4 కోట్ల 20 లక్షల రూపాయలు విరాళం అందింది. ప్రవాస భారతీయులైన రవి ఐకా తరఫున వారి ప్రతినిధి ఈ విరాళాన్ని అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను ఇచ్చారు.
దాత రవి ఐకా ఇప్పటికే పలు ట్రస్టులకు దాదాపు 40 కోట్ల రూపాయల వరకు విరాళం అందించారని తెలిపారు అదనపు ఈవో ధర్మారెడ్డి. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం ఆయన రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని ఈవో వివరించారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి : TTD board: తితిదే ధర్మకర్తల మండలా.. వైకాపా పాలక మండలా..?