చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 7 వరకూ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంగ్లం, పద్యాలు, ముత్యాల చిత్రలేఖనం, పియానో వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లావ్యాప్తంగా 66 మండలాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నట్టు వివరించారు.
ఇదీ చదవండి