student suicide in chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఏ రంగంపేట పంచాయతీలో.. వాసంతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సాయి నగర్లో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న వాసంతి డిప్లమా సెకండియర్ చదువుతున్నట్లు.. నిర్వాహకులు తెలిపారు. యువతి మొదటి సంవత్సరం మూడు సబ్జెక్ట్ లు తప్పడంతో.. తన తండ్రి కళాశాలకు వచ్చి కలవటానికి ప్రయత్నించటంతో భయపడింది. దీంతో విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చంద్రగిరి పోలీసులు విద్యార్థిని ఉంటున్న గదిని పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
YCP Leader Suicide Attempt : పొలం కోసం వైకాపా నాయకుడి ఆత్మహత్యాయత్నం