ETV Bharat / state

జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినం - chittoor dst covid updates

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కలెక్టర్ నారాయణ గుప్తా, ఎస్పీ సెంథిల్ పర్యటించారు. లాక్ డౌన్ పకడ్భందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.

జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినం
జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినం
author img

By

Published : May 11, 2020, 6:59 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ పర్యటించారు. నియోజకవర్గంలో మొదటిసారిగా మండల కేంద్రం ములకలచెరువులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేయాలని, చెన్నై కోయంబేడు మార్కెట్​కు వెళ్లి వచ్చిన డ్రైవర్లు, క్లీనర్లు, రైతులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయించాలని, వాలంటీర్ల ద్వారా గృహాలకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి ప్రధాన వార్తలు@ 1pm

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.