తిరుమలేశుని తెప్పోత్సవాలు ఐదురోజులపాటు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో ఆకరి రోజున శ్రీవారు అమ్మవార్లతో కలసి తిరుచ్చీ వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులై ఏడుమార్లు ప్రదక్షిణంగా విహరించారు. విశేష తిరువాభరణాలు, పరిమల భరిత పూలమాలలతో ఆళంకారభూషితులైన ఉత్సవమూర్తులను వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తి సంకీర్తనల నడుమ తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవాలు ముగియడంతో ఐదు రోజులపాటు రద్దు చేసిన ఆర్జితసేవలను పుణరుద్దరించారు.
ఇదీ చదవండి: కొత్తపట్నంలో ఉత్సహంగా బీచ్ ఫెస్టివల్