చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతామూర్తుల హుండీల నుంచి నెల రోజుల్లో కోటి ఎనిమిది లక్షల నలభై ఐదు వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో పెద్దరాజు తెలిపారు. బంగారం 45 గ్రాములు, వెండి 431 కిలోలు, గో సంరక్షణ నిధి కింద రూ. 82 వేలు వచ్చినట్లు వివరించారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో...
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు చేపట్టారు. నెల రోజులల్లో రూ. 35,01,379 లక్షలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ తెలిపారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి రూ. 29,51,338 లక్షలు, అన్నప్రసాదం హుండీల నుంచి రూ. 5,50,041 లక్షల ఆదాయం వచ్చిందని.. అమెరికా డాలర్లు 86 వచ్చాయని ఈవో వివరించారు.
ఇదీ చదవండి: