చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు దర్శనానికి అనుమతించేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయ సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగిటివ్ రావటంతో ఈ నెల 15న ఉదయం శాంతి అభిషేకాలు, అదే రోజు మధ్యాహ్నం ఆలయ సిబ్బందితో ట్రయిల్ రన్ నిర్వహణ, 16న మధ్యాహ్నం స్థానికులను దర్శనానికి అనుమతి ఇచ్చే దిశగా ప్రణాళికలు వేశారు.
ఆలయానికి వచ్చే భక్తులు విధిగా భౌతికదూరం పాటించటంతోపాటు మాస్కులు ధరించాలని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధులు, చిన్న పిల్లలను దర్శనానికి అనుమతించబోమన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి