ఇదీ చదవండీ:
'విద్యావిధానాన్ని మార్చాలి... విలువలు నేర్పించాలి' - thirupathi students news for disa murder encounter
చిన్నతనం నుంచే పిల్లలకు విలువలు నేర్పాలి. ర్యాంకుల మాయాజాలం కాదు.. సమాజానికి విలువలతో కూడిన విద్యావిధానం నేర్పాలి. సాటి మనిషితో మంచిగా ప్రవర్తించాల్సిన తీరుని అలవాటు చేయాలి. ఆడపిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంచి పోషించాలి. చట్టం ప్రతి ఒక్కరికీ సమానమే. కుల, మత, వర్గ విబేధాలు లేవన్న సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి. అత్యాధునిక సాంకేతికత మాన, ప్రాణ రక్షణకు ఆసరా కావాలి. ఇవి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థినిలు ఆశిస్తోన్న అంశాలు. దిశ హత్యాచారం కేసులో పోలీసుల ఎన్ కౌంటర్‌ను స్వాగతించిన విద్యార్థులు... శాశ్వత ప్రక్షాళన దిశగా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై తమ మనోభావాలను 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
దిశ హత్యకేసు ఎన్‌కౌంటర్‌పై శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ విద్యార్థినుల స్పందన
ఇదీ చదవండీ:
sample description