చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మివ్రతం కన్నులపండుగగా జరిగింది.ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారి ఆలయంలోని ఆస్థానమండపంలో వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు...వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రత వేడుకల్లో తితిదే ఈఓ అనిల్‌కుమార్‌సింఘాల్, జేఈఓ బసంత్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. వరలక్ష్మివ్రతం సందర్భంగా ఆస్ధానమండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, ఫలపుష్పాలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది భక్తులు పాల్గొన్నారు.వేడుకలు ముగిసిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశామని... ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఇదీచూడండి.వరద గుప్పిట్లో కేరళ.. 22కు చేరిన మృతులు