చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే జేఈవో బసంత్‌కుమార్ తెలిపారు. తితిదే పరిపాలన భవనంలో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 1న అంకురార్పణ, మార్చి 2న ధ్వజారోహణం, మార్చి 6న గరుడవాహనం, మార్చి 7న వసంతోత్సవం, మార్చి 10వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని జేఈవో అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతి రోజు సాయంత్రం నిర్వహించే ఊంజల సేవలో ప్రముఖ కళాకారులతో అన్నమయ్య సంకీర్తనలు ఏర్పాటు చేయాలని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌కు జేఈఓ సూచించారు. గార్డెన్ విభాగం ఆధ్యర్యంలో ఆలయంలో పుష్పలంకరణలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: తిరుపతిలో ప్రేరణ యువజనోత్సవాలు