తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం మైదానంలో శ్రీకృష్ణ శ్రీ గోదా దేవి కల్యాణం కన్నుల పండువగా సాగింది. గోదాదేవి ఆవిర్భావం, గోదాకల్యాణ ప్రాశస్త్యం గురించి ధర్మప్రచారకులు వివరించారు. ధనుర్మాసానికి వీడ్కోలు, మకరసంక్రాంతికి స్వాగతం పలుకుతూ... గోదా కల్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పుణ్యాహవచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, కంకణ పూజ నిర్వహించారు. తొలుత సర్కారు సంకల్పం, అనంతరం భక్తులందరితో సంకల్పం చేయించారు. ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ స్వామి వారికి కంకణాలు కట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు.
ఇవీ చదవండి