ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా ఊరందూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఊరేగింపుగా మరల శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేర్చారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనాలతో మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: