చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద యాగకలశాలను ఏర్పాటు చేశారు. ఆలయంలో పొరుగుసేవక అర్చకునిగా పనిచేస్తున్న నాగరాజు ఇటీవల ముక్కంటి ఆలయ శివలింగాన్ని స్పృశించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జరిగిన అపచారానికి నివృత్తిగా సంప్రోక్షణకు ఆలయ అధికారులు, అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి వేర్వేరుగా యాగకలశాలను ఏర్పాటు చేసి సంకల్ప పూజలను ప్రారంభించారు. యాగ కలశాలను ఉద్వాసన చేసి ఆలయంలో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని మూలమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: