స్థానిక ఎన్నికల ప్రక్రియపై ప్రత్యేక పోలీసుల బృందం విచారణ - undefined
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎంపీటీసీ, జడ్పీటీసి నామినేషన్ల ప్రక్రియలో జరిగిన పరిణామాలపై పోలీసుల ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. అదనపు ఎస్పీ మునిరామయ్య ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. నామినేషన్లో జరిగిన దాడులు ఆధారాలను సేకరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నామినేషన్ల ప్రక్రియలో చోటు చేసుకున్న సంఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయని ముని రామయ్య అన్నారు. ఈసీ ఆదేశానుసారం విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ అభ్యర్థులు తెలిపిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతామని వివరించారు.
స్థానిక ఎన్నికల ప్రక్రియపై ప్రత్యేక పోలీసుల బృందం విచారణ
By
Published : Mar 17, 2020, 11:37 PM IST
.
స్థానిక ఎన్నికల ప్రక్రియపై ప్రత్యేక పోలీసుల బృందం విచారణ