లాక్‌డౌన్‌తో సంక్షోభంలో ఉన్న ఎస్పీడీసీఎల్‌కు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు హెచ్.హరనాథరావు.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు 50 శాతం మేర బకాయిలను తక్షణం చెల్లించాలనే ఆదేశాలుండగా.. ఫిబ్రవరి మాసానికి సంబంధించి మార్చి నెలలో 80 శాతం మాత్రమే బిల్లులు వసూలయ్యాయని చెప్పారు. మరో 20 శాతం అంటే.. రూ.160 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతబడిన కారణంగా ఏప్రిల్‌కు సంబంధించి రూ.850 కోట్ల వ్యాపారం జరగాల్సి ఉండగా రూ.350 కోట్ల మేర తగ్గిపోనున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిలో సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని.. వినియోగదారులు వెంటనే బిల్లులు డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కూడా హెచ్‌టీ వినియోగదారుల సర్వీసుల మీటర్ రీడింగ్ ప్రకారమే బిల్లులు జారీ చేశామన్నారు. వీరు అపరాధ రుసుం లేకుండా ఈనెల 20 లోపు చెల్లించాలని సూచించారు.
ఇదీ చూడండి: