ETV Bharat / state

తిరుమలలో పోలీసుల పర్యవేక్షణ... - Sp Ramesh Reddy news in tirupati

తిరుమల కొండపై భక్తజన సంచారం ప్రారంభమైంది. 80 రోజులకు పైగా బోసిపోయిన కొండపై సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్​రెడ్డి కనుమదారులను, వైకుంఠంలో క్యూ లైన్లను పరిశీలించారు. తిరుమల పరిసరాల్లో భక్తులు గుమిగూడకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దర్శనానికి వచ్చే వారందరూ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న తిరుపతి ఎస్పీతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖీ..

Sp Ramesh Reddy Checked Alipiri Gate
తిరుమలలో పోలీసుల పర్యవేక్షణలు
author img

By

Published : Jun 11, 2020, 4:20 PM IST

సుదీర్ఘ విరామం తర్వాత తిరుమల వచ్చే భక్తుల విషయంలో వైద్యపరంగా, భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. అలిపిరిలోని సప్తగిరి టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించిన ఆయన....ఘాట్ పైకి వెళ్లే భక్తులను పరీక్షించి పంపిస్తున్న విధానాలను పరిశీలించారు. తిరుపతి అర్బన్ పోలీసులు, తితిదే విజిలెన్స్ సంయుక్తంగా కృషి చేస్తూ...భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామి వారిని దర్శించుకునేలా కృషి చేస్తున్నామన్నారు.

తిరుమలలో పోలీసుల పర్యవేక్షణలు

ఇదీ చూడండి. తిరుమలలో కనువిందు చేస్తున్న.. చిరుజల్లులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.