తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. శ్రీకాళహస్తిలో 300 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు.
అనంతరం ఏర్పేడు మండలంలోని రాజులపాలెం సమీపంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలకు సరకులు పంచారు. వారితో కలిసి సరదాగా వరి నాట్లు వేశారు. వ్యవసాయ పనులు చేశారు. తనది రైతు కుటుంబ నేపథ్యం అని చెప్పారు.
ఇదీ చదవండి: