తిరుపతిలో కరోనాతో పోరాడుతూ.. మహిళా కానిస్టేబుల్ సెల్వీ మృతి చెందింది. ఆమె మృతదేహానికి.. తిరుపతి అర్బన్ పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో.. అమరవీరుల స్తూపం వద్ద తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి.. పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. శోకసంద్రంలో ఉన్న సెల్వీ కుటుంబాన్ని ఓదార్చారు.
1991 బ్యాచ్‌కు చెందిన సెల్వీ... అలిపిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు కరోనా సోకడంతో స్విమ్స్ లో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృతి చెందారు.
ఇదీచదవండి.