శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా మారింది. నిరంతరం కూంబింగ్ కొనసాగుతున్నా... వెరవక స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి పోలీసులు కల్యాణి డ్యాం నుంచి భాకరాపేట వైపు కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం భాకరాపేటలోని చామల అటవీ ప్రాంతంలో నాగపట్న ఈస్ట్ బీట్ వద్ద స్మగ్లర్ల అలికిడి వినిపించింది. వారిని పట్టకునే ప్రయత్నం చేయగా... స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయారు. అయితే అప్పటికే వారి సమీపంలోని వాహనంలో 15 దుంగలను లోడ్ చేశారు. చుట్టు పక్కల సోదా చేసి పడేసిన నాలుగు దుంగలను వెతికి పట్టుకున్నారు. వాహనంలో చెట్లను నరకడానికి ఉపయోగించే రంపాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపులు చేపట్టారు. ఓ స్థానిక స్మగ్లర్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :