రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నా... ఇసుకాసురులు తమ అక్రమ రవాణాను ఆపడం లేదు. చిత్తూరు జిల్లా స్వర్ణముఖి వాగు పరీవాహక ప్రాంతాల్లోని రైతులు...ఇసుక రవాణా జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మండలంలోని శానంపట్ల పంచాయతీలో దాడి చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించి మైనింగ్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా.. తమిళ స్మగ్లర్ అరెస్టు