ETV Bharat / state

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శివరాత్రికి ప్రత్యేక పూజలు - Kapileswaraswamy Brahmotsavalu

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మహా శివరాత్రి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్ర‌వారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఏకాదశ రుద్రాభిషేకం, మంగళధ్వని, పురాణ‌ ప్ర‌వ‌చ‌నం, సంగీతం, హ‌రిక‌థ‌, నంది వాహనసేవలు జరగనున్నాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

Shivaratri Arrangements  in Sri Kapileswaraswamy Brahmotsavas at tirupati
శ్రీ కపిలేశ్వరస్వామి
author img

By

Published : Feb 19, 2020, 7:17 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.