రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి సందర్భంగా మేళ తాళాలు, కోలాటాలు, వేదపండితుల మంత్రోశ్ఛరణల మధ్య శివయ్య రథోత్సవ, కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా విజయవాడ, బలివేలో ముక్కంటి ఉరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరులోని బ్రహ్మంగారి మఠం, ఓర్వకల్లు, మంత్రాలయం, డోన్, మహానంది, గడివేములలోని భోగేశ్వర స్వామి ఆలయం, ఆదోనిలో పరమ శివుని రథోత్సవం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో నాయుడుపేట, మూలపేటలో మహాశివుని మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, విశాఖ జిల్లా చోడవరంలోని శైవ క్షేత్రాలన్నీ శివ నామస్మరణతో మార్మోగాయి.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని హేమావతి గ్రామంలో.. మనిషి రూపంలో కనిపించే శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దేశ్వర అంటూ పిలవబడే శ్రీ హేంజేరు సిద్దేశ్వర స్వామి ఆలయంలో అగ్నిగుండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
ఇదీ చదవండి: ప్రకాశంలో జిల్లాలో పరమేశ్వరుని ప్రత్యేక పూజలు