ఈ నెల 24న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమల పర్యటన నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. తిరుమలకు ప్రముఖులు వస్తున్నందున ఇంటెలిజెన్స్ ఐజీ జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తమం చేశారు. అధికారులు భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. తిరుపతి అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్స్ నిర్వహించారు.
ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్, జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతి పర్యటించనున్న ప్రాంతాలన్నీ టెస్టింగ్ కాన్వాయ్ ద్వారా తనిఖీ చేశారు. రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి పద్మావతి అతిథి గృహం, తిరుమల ఘాట్ రోడ్డు, శ్రీవారి ఆలయం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
ఇదీ చదవండి: