ETV Bharat / state

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

author img

By

Published : Feb 6, 2021, 12:42 PM IST

Updated : Feb 7, 2021, 3:50 AM IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

12:39 February 06

.

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంది. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలపై  పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయని భావించిన ఎస్ఈసీ.. ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు సజావుగా జరిపేందుకు,  ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.  మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో మాట్లాడనివ్వొద్దని ఎస్‌ఈసీ ఆదేశించింది. పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలోనూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయని పేర్కొంది.  మంత్రిగా ఆయన విధులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, దస్త్రాలు అందుబాటులో ఉంచాలని అదేశాల్లో స్పష్టం చేశారు. 

అత్యవసర పనులుంటే బయటకు వెళ్లొచ్చు

వైద్యం, ఇతర అత్యవసర పనుల నిమిత్తమైతే మంత్రిని ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించవచ్చని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. అయితే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్న కారణం హేతుబద్ధంగా ఉండాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మీడియాను గానీ, మద్దతుదారులు, అనుచరుల్ని గానీ మంత్రి కలవకుండా చూడాలని స్పష్టం చేశారు. "ఒక మంత్రిగా ఆయన తన అధికారిక విధులు నిర్వర్తించకుండా ఈ ఆదేశాలు నిరోధించవు. ఆయన తనకు కావలసి అధికారిక పత్రాల్ని, రికార్డుల్ని రప్పించుకోవచ్చు, వాటిపై నిర్ణయాలూ తీసుకోవచ్చు. కేవలం ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే మంత్రి కదలికలపై పరిమితులు విధించాం. ఈ ఉత్తర్వులకు సవరణ అవసరమని ఏ పరిస్థితుల్లోనైనా మంత్రి భావిస్తే కమిషన్‌ దృష్టికి తీసుకురావొచ్చు. పరిశీలించి కమిషన్‌ తగు నిర్ణయం తీసుకుంటుంది" అని ఎస్​ఈసీ పేర్కొన్నారు.

మంత్రి వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే

అధికారుల్ని బెదిరిస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పక్షాల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. "పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా, రాజ్యాంగ నిబంధనలకూ విఘాతం కలిగించినట్టు. మరీ ముఖ్యంగా ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించినట్టు. ఎన్నికల సంఘం ఆదేశాల్ని పాటిస్తే చర్యలు తప్పవని కలెక్టర్లను, రిటర్నింగ్‌ అధికారుల్ని మంత్రి హెచ్చరించడం చట్టాల్ని, రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. మంత్రి వ్యాఖ్యల వల్ల తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు, ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూసేందుకు తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరమని కమిషన్‌ భావించింది. అందుకే వివిధ ప్రత్యామ్నాయాల్ని పరిశీలించిన మీదట.. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని తుది దశ పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఆయన నివాసానికే పరిమితం చేయాల్సిందిగా డీజీపీని ఆదేశిస్తున్నాం" అని ఎస్‌ఈసీ వివరించారు. మంత్రి తిరుపతిలో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివిధ ఆంగ్ల పత్రికల క్లిప్లింగ్‌లను ఎస్‌ఈసీ తన ఆదేశాలకు జతచేశారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రమేశ్‌కుమార్‌ లేఖ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ముగిసే వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ తాను ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తెలియజేశారు. తాను అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అందుకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఆయన శనివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం తిరుపతికి వస్తున్నారు. ఆయనకు స్వాగతం చెప్పే ప్రముఖుల జాబితాలో జిల్లాకు చెందిన మంత్రిగా పెద్దిరెడ్డి పేరు కూడా ఉండే అవకామున్న నేపథ్యంలో, తాజా పరిణామాల్ని వివరిస్తూ రమేశ్‌కుమార్‌ లేఖ రాసినట్టు సమాచారం.

ఆదేశాలను పరిశీలించాక మాట్లాడతా: డీజీపీ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలు ఇంకా తనకు అందలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఆదేశాలు అందాక వాటిలో ఏముందో పరిశీలించి మాట్లాడతానన్నారు. శనివారం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

పెద్దిరెడ్డి ఏమన్నారంటే...
 ‘‘తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాట విన్నా... మేము అధికారంలో ఉన్నన్ని రోజులూ మిమ్మల్ని బ్లాక్‌లిస్టులో పెడతాం’’ అని జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘మీ అందరికీ మీడియా ముఖంగా చెబుతున్నా.. జాగ్రత్తగా ఉండండి. ఏ అధికారి అయినా ఎస్‌ఈసీ మాటలు వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అని అనుకుంటే గుణపాఠం తప్పదు. అందరినీ గుర్తు పెట్టుకుంటాం. చిత్తూరు, గుంటూరులో ఏకగ్రీవాలను ఆపమని ఆయన(నిమ్మగడ్డ) అంటున్నారు. మీరు ఆయన మాట వినకుండా ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ డిక్లరేషన్లు అందజేయాలని సూచిస్తున్నా. ఇవ్వకపోతే.. పేరు పేరునా గుర్తు పెట్టుకొని ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఏ అధికారి కూడా నిమ్మగడ్డను గౌరవించి పని చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. శుక్రవారం తిరుపతిలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ‘నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మార్చి 31 వరకే ఎస్‌ఈసీగా ఉంటారు. అంతవరకూ మేము ఏమీ మాట్లాడదలచుకోలేదు.  రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో వైకాపా అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. ప్రజలందరూ ఏ వైపు ఉన్నారని గుర్తించకుండా ఏకగ్రీవాలను ఆపాలనే అధికారం నీకెక్కడిది’ అని ఎస్‌ఈసీని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: నిమ్మగడ్డ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: పెద్దిరెడ్డి

Last Updated : Feb 7, 2021, 3:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.