మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత గ్రామపంచాయతీ కందులవారిపల్లిలో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి రాజయ్యను వేదికపై కూర్చోపెట్టారని, అది ప్రశ్నించిన ఉపసర్పంచ్ రాకేష్ చౌదరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం హేయమైన చర్య అని తెదేపా ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు విసిరిపాటి శంకర్ మండిపడ్డారు. చంద్రగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
గతంలో ఏ సమస్య వచ్చినా మండల స్థాయిలో దళిత సంఘాల నాయకులు చర్చించుకుని సామరస్యంగా వెళ్లేవారు. ఇప్పుడు ఆ దుస్థితి లేదని.. తెదేపా నాయకులు.. సమస్యలపై ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పోలీసుల చేత పెట్టించి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎస్సీలను మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, స్పీకరుగా చేసిన ఘనత తెదేపాకే చెందుతుందన్నారు.
ఇదీ చదవండి: నిత్య పెళ్లికూతురు అరెస్టు.. అనంతరం బెయిల్పై విడుదల