పుత్తూరులో తెదేపా 'సేవ్ అమరావతి' ర్యాలీ - amaravathi rally in chittor district
చిత్తూరు జిల్లా పుత్తూరులో సేవ్ అమరావతి పేరిట తెదేపా నాయకులు ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కార్వేటినగరం రోడ్డు కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు.