Sand Mafia At Kaundinya River: ప్రతి రోజు ప్రతి జిల్లాలో అక్రమ ఇసుక రవాణా విరామం లేకుండా స్వేచ్చగా జరుగుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్చగా అక్రమ ఇసుక రవాణా విరామం లేకుండా సాగుతూనే ఉంది. ప్రభుత్వ అధికారులు వారి పనులకు కళ్లెం వేసిన అవన్ని విఫలం అవుతున్నాయి. వారు చేసే అక్రమ కార్యక్రమాలకు అమాయకులైన అన్న దాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశ్నించిన వారి నోళ్లు మూయిస్తూ వారి దందా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో మాకు దారి ఇవ్వండి మహాప్రభూ అని రైతులు వేడుకుంటున్నారు.
అక్రమ ఇసుక రవాణా జరగదు: చిత్తూరు జిల్లా యధావిధిగా కౌండిన్య నది నుండి ఇసుక అక్రమ రవాణా చాలా రోజులుగా జరుగుతుంది. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గత బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కౌండిన్ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను పూర్తిగా అడ్డుకున్నామని, ఇకపై కౌండిన్య నది నుండి అక్రమ ఇసుక రవాణా జరగబోదని చెప్పారు.
అధికారులు మాటలు పట్టించుకోని అక్రమదారులు: ఇసుక అక్రమదారులు అధికారి మాటలను గాలికి వదిలేశారు. ఆయన మాటలను లెక్కచేయకుండా వారి పనిలో వారు నిమగ్నమైపోయారు. అయితే మరుసటి రోజే యథేచ్చగా, యధావిధిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కౌండిన్య నది నుండి ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తూనే ఉన్నారు.
మాకు దారివ్వండి మహాప్రభూ !: కౌండిన్య నది పక్కన ఉన్న వ్యవసాయ రైతులు సైతం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాల వల్ల వారి పంట పొలాలకు దారిని సైతం వదలడం లేదని, ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని రైతులు మీడియా ముందు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని, కౌండిన్య నది నుండి సాగిస్తున్న అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తరువాతైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇవీ చదవండి