ETV Bharat / state

'కలికిరిలో రోడ్డు ప్రమాదాలపై డెమో' - road accident demo

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్​ పోలీసులు డెమో నిర్వహించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపి ప్రమాదాలకు గురి కావద్దని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకుని వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు.

'కలికిరిలో రోడ్డు ప్రమాదాలపై డెమో'
author img

By

Published : Sep 12, 2019, 11:55 PM IST

'కలికిరిలో రోడ్డు ప్రమాదాలపై డెమో'

చిత్తూరు జిల్లాలో కలికిరి పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు, వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనచోదకుల నిర్లక్ష్యం, ఏమరపాటుతో జిల్లాలో ప్రతి రోజుకు సగటున నలుగురు రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నట్లు తెలిపారు. కలికిరి పట్టణంలో 4 రోడ్ల కూడలి వద్ద ద్విచక్ర వాహనంలో సెల్ ఫోన్​ మాట్లాడుతూ లారీని ఢీ కొని యువకుడు మృతి చెందిన ఘటనపై డెమోను నిర్వహించారు. అనుకోని ప్రమాదాల్లో కుటుంబ పెద్దలు, సభ్యులు మరణిస్తే జరగబోయే కష్టనష్టాల గురించి కలికిరి ఎస్ఐ రామాంజనేయులు ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకుని వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

రోడ్డు ప్రమాదంలో హెడ్​కానిస్టేబుల్ మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.