ETV Bharat / state

Road Accident at chittor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - చిత్తూరు జిల్లా ఐతేపల్లి వద్ద రోడ్డుప్రమాదం

Road Accident at ithepally in chittor
చిత్తూరు జిల్లా ఐతేపల్లి వద్ద రోడ్డుప్రమాదం
author img

By

Published : Feb 18, 2022, 12:37 PM IST

Updated : Feb 18, 2022, 5:03 PM IST

12:34 February 18

మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తింపు

చిత్తూరు జిల్లా ఐతేపల్లి వద్ద రోడ్డుప్రమాదం

Road Accident at chittor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుఅయ్యింది. ఈ దుర్ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రెండేళ్ల పాప కూడా ఉంది. చనిపోయిన నలుగురినీ విశాఖ వాసులుగా గుర్తించారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

గోల్డెన్ టెంపుల్​కు వెళ్తుండగా ఘటన..
ఇవాళ ఉదయం తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రం వేలూరులోని గోల్డెన్ టెంపుల్​కు వెళుతుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి తమిళనాడు రాష్ట్రం జాలరిపేటకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని.. వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడంతో.. ఈ దారుణం జరిగింది.

ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన స్వాతి (25).. ఆమె తమ్ముడు ప్రేమ్ కుమార్ (23), కుమార్తె శ్యామాక్షిత (2), వారి స్నేహితుడు సునీల్ కుమార్ మృతి చెందారు. డ్రైవర్ ఖాదర్​వలికి తీవ్రగాయాలు కాగా.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు.. గాజువాక నుంచి తిరుపతి బయలుదేరారు.

ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో.. గాజువాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్వాతి భర్త వీఎల్ నారాయణ.. సింగపూల్​లో ఉన్నట్లు ఆమె తండ్రి రామచంద్రరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను.. తిరుపతి రుయా ఆసుపత్రి తరలించారు. గతంలో కూడా ఈ ప్రదేశంలో ఓ ప్రమాదం జరగగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు.

ఇదీ చదవండి:

Marijuana Seized : బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా

Last Updated : Feb 18, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.