రైస్ పుల్లింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తోన్న ముఠాను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.59 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన గుమ్మడి వెంకటరత్నం, పటేల్ ముఖేష్, చిత్తూరుకు చెందిన సిద్దిప్ప, బెంగళూరుకు చెందిన జయం సునీల్, చీరాలకు చెందిన ప్రసాద్‌లను పట్టుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. అక్టోబర్ 14న వీరి వద్ద మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి వీరిని పట్టుకున్నామని అన్నారు.
రైస్‌పుల్లింగ్ అంటే..?
రైస్ పుల్లింగ్ అనేది ఒక యంత్రం. తమ వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని, అతీంద్రియ శక్తులున్నాయని నిందితులు ప్రజలను నమ్మిస్తారు. వాటి ద్వారా మంచి జరుగుతుందని ప్రజలను నమ్మిస్తారు. ముందస్తు ఖర్చుల కోసం డబ్బులు కావాలని చెప్పి తీసుకుంటారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
ఇదీ చూడండి:
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. గ్రూప్‌లో చేరడం ఇక మీ ఇష్టం!