చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని శేషాచల అడవుల సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసులకు అందిన సమాచారంతో తుమ్మచేనుపల్లి అడవులలో భాకరాపేట వద్ద కూంబింగ్ నిర్వహించారు. అటవీ ప్రాంతమైన ఎర్రకొండలో పోలీసులకు స్మగ్లర్లు తారసపడ్డారు. పోలీసుల రాకను గుర్తించిన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు 10 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం - చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని శేషాచల అడవుల సమీపంలో... అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం తరలిస్తున్న 10మంది నిందితులను అరెస్టు చేసి, 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
![అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం redsandal smugglers arrest in chinnagottigallu mandal at chittor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7905781-895-7905781-1593957260586.jpg?imwidth=3840)
చిన్నగొట్టిగల్లు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం