redsandal seized at chittor: చిత్తూరు జిల్లా నారాయణవనం పోలీసులు.. రూ.1.5 కోట్లు విలువగల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం రూరల్ సీఐ సురేష్, ఎస్ఐ ప్రియాంక తమ సిబ్బందితో నారాయణవనం ఊత్తుకోట మార్గ మధ్యలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. పాలమంగళం వద్ద అనుమానంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద ఉన్న బొలెరో వాహనంలో తనిఖీలు చేపట్టారు.
అందులో 20 ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. నిందితులను విచారించగా.. సదాశవకోనకు వెళ్లే దారిలో గల పందులయ్య కోనకొండపై స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. కోనకొండపై ఉన్న 270 ఎర్రచందనం దుంగలు, 14 మంది స్మగ్లర్లను పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నాట్లు.. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:
Liquor Rates Reduced in AP: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు