ఎర్రచందనం దుంగలు స్వాధీనం శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఆపేందుకు నిరంతర కూంబింగ్‌లు నిర్వహిస్తున్నా స్మగ్లర్లు ఏమాత్రం భయపడటం లేదు. తిరుపతికి చెందిన వ్యక్తి సాయంతో 29 ఎర్రచందనం దుంగలను రవాణా చేయటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. కళ్యాణి డ్యామ్ నుంచి బాకరాపేట ఘాట్ వైపు టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఏ.రంగంపేట, ఆవుల దొడ్డి వద్ద అనుమానాస్పదంగా ఉన్న కారును అధికారులు గుర్తించారు. అదే సమయంలో సుమారు 35 మంది స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తుండగా, టాస్క్‌ఫోర్స్ వారిని చూడగానే దుంగలను పడేసి పరారయ్యారు. దట్టమైన పొదలు, చిమ్మచీకటి వారు పారిపోవటానికి అనుకూలంగా మారింది. కారు వద్ద ఉన్న సయ్యద్ జమీల్‌ను అరెస్టు చేసి, 29 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఎంపీడీవోపై దాడి... చర్చనీయాంశమైన వైకాపా నేత తీరు..!