చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలం తలకోనలో అక్రమంగా తరలిస్తున్న 11 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తలకోన అడవిలో కూంబింగ్ చేపట్టిన అధికారులు, 15మంది ఎర్రచందనం స్మగ్లర్లను గుర్తించారు. అధికారుల రాకను గమనించిన స్మగ్లర్లు దుంగలను వదిలేసి పరారయ్యారు. దుంగలను స్వాధీనపరుచుకుని.. ఒకరిపై కేసు నమోదు చేశారు. పరారైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎఫ్ఎస్ఓ నాగరాజు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం తుంగోడు సమీపంలో ఉన్న డేగలపెంట అడవిలో 18ఎర్రచందన దుంగలను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన స్మగ్లర్లు డేగలపెంట అడవిలో ఎర్రచందన దుంగలను దాచారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. దుంగలను స్వాధీనం చేసుకుని కనిగిరి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.