ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం డంప్ స్వాధీనం - chittoor district crimenews

చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలో ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు భారీ డంప్​ను స్వాధీనం చేసుకున్నారు. మెుత్తం సోదాల్లో 101 ఎర్ర చందనం దుంగలను అధికారులు గుర్తించారు.

చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం డంప్ స్వాధీనం

author img

By

Published : Jun 6, 2021, 3:23 AM IST

చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలోని గంగమ్మ కోన వద్ద ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు భారీ డంప్​ను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మెుత్తం పది చోట్ల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు వీలుగా స్మగ్లర్లు..డంపులను ఏర్పాటు చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎర్రచందనం ప్రత్యేకదళానికి చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. రెడ్ శాండల్ టాస్క్​ఫోర్స్ డీఎస్పీ మురళీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో మెుత్తం 101 ఎర్రచందనం దుంగలను అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు.

ఇదీ చదవండి:

RRR: నన్ను తీవ్రంగా కొట్టి.. నా ఫోన్​ను దుర్వినియోగం చేశారు: రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.