ETV Bharat / state

ఇంటిపట్టున ఆన్‌లైన్‌ చదువు.. విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం

author img

By

Published : Mar 30, 2020, 4:03 PM IST

వార్షిక పరీక్షలపై ఈ ఏడాది కరోనా ప్రభావం చూపడంతో ఇంటి వద్దనే విద్యార్థులు ఆన్‌లైన్‌ చదువులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇంట్లో ఉంటూ ఉన్న సాంకేతిక సాధనాల ద్వారా ప్రవేశ పరీక్షలకు తర్ఫీదు పొందుతున్నారు. ఈ మేరకు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే పాఠాలు బోధించే పనిలో ఉన్నారు.

online study Corona's impact on the education system
ఇంటిపట్టున ఆన్‌లైన్‌ చదువు..విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం

చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు పూర్తయినప్పటికీ సీబీఏస్‌ఈకి సంబంధించి 12వ తరగతి పరీక్షలు ఇంకా కొన్ని జరగాల్సి ఉంది. ఎంసెట్‌, నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా మే నెలలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు ప్రైవేట్‌ విద్యాసంస్థలు, అకాడమీలు పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ తరగతులను కూడా ప్రారంభించారు. వీటితోపాటు పదో తరగతి పరీక్షలూ జరగాల్సి ఉంది.

విద్యాసంవత్సరం ముగింపులో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించడంతో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో అన్ని రకాల వార్షిక , ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మరో వైపు ప్రవేశ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే విద్యాసంస్థలపై తీవ్రప్రభావం చూపింది. ఈ మేరకు విద్యార్థులు రెండు వారాలుగా ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు విద్యాసంవత్సరం నష్టపోకుండా తక్షణమే అన్ని రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉంటూ ఆన్‌లైన్‌ బోధన అవలంభిస్తున్నారు.

విద్యార్థులు నష్టపోకుండా...

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో విద్యార్థులు నష్టపోకుండా అంతర్జాలంలో ఫైబర్‌ నెట్‌ ద్వారా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నందున ఎక్కువ మంది విద్యార్థులు వీటిపై దృష్టిపెట్టారు. ఇవి కాకుండాదీక్ష యాప్‌ద్వారా మొబైల్‌ ఫోన్‌ పాఠాలు వినే వెసులుబాటు కూడా ఉంది. ఎంసెట్‌, నీట్‌, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే విద్యాసంస్థలు తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. వీరికి అవసరమైన బోధన సామగ్రిని ఇందులో ఉంచి వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అవసరమైన సమయంలో ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. నెల్లూరు నగరం, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, కావలి, ఆత్మకూరు లాంటి ముఖ్యపట్టణాల్లో సాంకేతిక సాధానాలను బోధన సాధనాలుగా ఎంచుకున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులు 38,172- ఎంసెట్‌, నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షలకు 28,782 పై చిలుకే.

ఇది చూడండి:

కరోనా కష్టాలు... వాడిపోతున్న పూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.