చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణం ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. మండలంలోని నరసింహాపురం పంచాయతీలో అయ్యవారికండ్రిగ, టీవీఎన్ఆర్ పురం గ్రామాలున్నాయి. పంచాయతీ కార్యాలయాలన్నీ నరసింహాపురంలోనే ఉన్నాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వ భవనాలను పంచాయతీలోని మిగిలిన గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా నియోజకవర్గ శాసన సభ్యుడు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని మిగిలిన గ్రామాల ప్రజలు కోరారు.
కొత్తగా పంచాయతీకి మంజూరైన రైతు భరోసా కేంద్రాన్ని టీవీఎన్ఆర్ పురం లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయంతో కోపోద్రిక్తులైన అయ్యవారి కండ్రిగ గ్రామస్తులు... నరసింహపురంలో అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేకపోవడంతో తమ గ్రామానికి గుర్తింపు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్డులను గుట్టలుగా పోసి నిరసన తెలియచేశారు. తమ గ్రామంపై వివక్షమాని.. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పోలీసులు విషయాన్ని మంత్రి నారాయణ స్వామి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన అనంతరం.. గ్రామస్తులు వెనక్కు తగ్గారు.
ఇదీ చదవండి: