ఈనెల 1వ తేదీన తిరుపతి నుంచి నిజామాబాద్‌కు(02793) రైలు బయలుదేరింది. తొలిరోజున 565 టిక్కెట్లు రిజర్వేషన్లు చేసుకోగా 53 మంది రాలేదు. ప్రతి రోజూ 400 నుంచి 500 మంది ప్రయాణిస్తుండగా ఇందులో 50 నుంచి 60 మంది టికెట్లు రిజర్వు చేసుకున్నా ప్రయాణానికి ఆసక్తి చూపడం లేదు. రిజర్వేషన్ చేసుకున్నా 15 రోజుల్లో 769 మందికిపైగా హాజరు కాలేదు. దాంతో ప్రతి రోజూ రాయలసీమ ప్రత్యేక రైలు ఖాళీగానే నడుస్తోంది. ప్రతిరోజూ 1400 మంది ప్రయాణికులు రాయలసీమ ప్రత్యేక రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నా కేవలం 500 నుంచి 600 మంది వెళుతున్నారు. శుక్రవారం 545 మంది ప్రయాణికులు తిరుపతి నుంచి టికెట్లు బుక్ చేసుకోగా ఇందులో 67 మంది రద్దు చేసుకున్నారు. శనివారం 477 మందికి గాను 87 మంది, ఆదివారం 538 గాను 61 మంది సోమవారం 522 టికెట్లు రిజర్వు చేసుకోగా 68 మంది టికెట్లు రద్దు చేసుకున్నారు.
ఇదీ చదవండి: 'భారత్-చైనా సరిహద్దు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం'