రైతులు భరోసా కేంద్రాలకు వెళ్లి కియోస్క్ ద్వారా తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పరికరాలకు ఆర్డర్ ఇస్తే చాలని... అవి అన్నదాతల ముంగిటకే వస్తాయని.. చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 70 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా నకిలీ, కల్తీ ఉత్పత్తుల విక్రయాలను నిరోధించే వీలుంటుందన్నారు.
భరోసా కేంద్రాల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులపై, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారన్నారు. సాగు పరికరాలను తక్కువ అద్దెకు అందజేస్తారని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చదవండి: 'రైతులకు భరోసా ఇచ్చేందుకే కేంద్రాలు'