రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు జూన్ 1 నుంచి నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేయనుంది. గ్రామ సచివాలయాల్లోని సీడీపీవో, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్త ద్వారా కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్ని చేర వేయనున్నారు.
ప్రీ స్కూల్ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు బియ్యాన్ని కేంద్రాల్లోనే వండి వడ్డించనున్నారు. బియ్యం సరఫరా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేంద్రాల్లో పౌష్టికాహారం అందరికీ అందేలా తీసుకోవలసిన చర్యలపై తంబళ్లపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి నాగరాణి.. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఇదీ చదవండి: