తెదేపా
పుత్తూరు పట్టణం 10, 17, 13 వార్డుల్లో తెదేపా అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకే ఓటు వేసి గెలిపించాలన్నారు. పుత్తూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు 136 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని గుర్తుచేశారు.
వైకాపా
నగరి నియోజకవర్గం పుత్తూరులో వైకాపా అభ్యర్థి రోజా ప్రచారం చేశారు. పట్టణంలోని 14,15,16 వార్డులో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.
భాజపా
పుత్తూరులో పార్టీ కార్యకర్తల సమావేశానికి భాజపా అభ్యర్థి నిషేధ హాజరయ్యారు. కేంద్రంలో మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భాజపా గెలుపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి.