చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో దళిత యువకుడు కిరణ్ మృతి చెందటంపై విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. శ్రీకాళహస్తికి చెందిన కిరణ్ కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు మే నెల 28 న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సంఘాల నాయకులు తెలిపారు. అదే రోజు వరదయ్యపాలెం బత్తలపల్లి సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న కిరణ్ ను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు.
మతిస్థిమితం సరిగా లేక ఇబ్బంది పడిన కిరణ్ ను సకాలంలో తిరుపతికి రెఫర్ చేయడంలో నిర్లక్ష్యం చేశారని.. అందుకే కిరణ్ మృతి చెందాడని వాపోయారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు అంత్య క్రియలు నిర్వహించబోమని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి:
global day of parents: ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నాడే.. రోడ్డుపై ఊతకర్రతో పెద్దాయన!