చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం నారిగానిపల్లెకు చెందిన రైతు రాజారెడ్డి... శత్రుపురుగుల నుంచి పంటల సంరక్షణకు సాంకేతికను వినియోగిస్తున్నాడు. రూ.5000 ఖర్చు చేసి సోలార్ లైట్ ట్రాప్‌ను కొన్నాడు. లైట్‌కు టైమర్, సెన్సార్ అమర్చి టమాటా తోటలో ఉంచాడు. లైట్ కింద భాగంలో కిరోసిన్‌తో కూడిన చిన్నటి తొట్టెను అమర్చాడు. సెన్సార్, టైమర్ సాయంతో లైట్‌ను సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 12గంటల వరకు వెలిగి ఆగిపోయాలా టైమర్ అమర్చాడు. అంతే... సోలార్ లైట్ ట్రాప్ శత్రు పురుగులను ఆకర్షిస్తోంది.
ఇంకేముంది అలా వచ్చి వాలిన పురుగులు లైట్ కింద భాగంలో అమర్చిన తొట్టెలో పడి చనిపోతున్నాయి. ఇలా క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించుకుంటూ సాగు వ్యయభారం నుంచి కాస్త ఊరట పొందుతున్నాడు రాజారెడ్డి.
ఇవీ చదవండి:వైద్యురాలు అనితారాణి కేసులో ప్రాథమిక విచారణ పూర్తి