దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో... దక్షిణ పళ్లెం కోసం ఇద్దరు అర్చకుల మధ్య వివాదం జరిగింది. వివాదానికి దిగిన ఇద్దరు అర్చకులపై సస్పెండ్ వేటు పడింది. ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఉపప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ భక్తుల ఎదుటే వివాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఆలయ ఈవో పెద్దిరాజు విచారణ జరిపించారు. ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండీ... బైపోల్: గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు