NARA LOKESH VEHICLE SEIZED : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ఆయన ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని క్లాక్ టవర్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. లోకేశ్ ఉపయోగించిన వాహనానికి మైక్ అనుమతి లేదని వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రచార వాహనాన్ని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసుల వైఖరికి నిరసనగా లోకేశ్, ఇతర నేతలు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతల నిరసనలతో సీజ్ చేసిన ప్రచార రథాన్ని పోలీసులు వదిలిపెట్టారు. అనంతరం లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు.
ఇవీ చదవండి: