ETV Bharat / state

లేబుల్‌ మిలటరీది... సరకు నకిలీది...

చిత్తూరులో మిలటరీ లేబుల్​తో నకిలీ మద్యాన్ని అమ్ముతున్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ.1.50 లక్షలు విలువ చేసే.. 210 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

police seized at fake alcohol at chittore
మిలిటరీ మద్యం లేబుల్​తో నకిలీ మద్యాన్ని అమ్ముతున్న నలుగురు అరెస్ట్
author img

By

Published : Oct 22, 2020, 5:31 PM IST

నకిలీ మద్యాన్ని అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు చిత్తూరులో అరెస్ట్ చేశారు .బెంగళూరు-తిరుపతి హైవే రోడ్డు, పెనుమూరు క్రాస్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చెట్లపొదల్లో దాక్కున్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షలు విలువ చేసే.. 210 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ మద్యాన్ని తయారుచేసి... దానిపైన మిలటరీ వాళ్లకు సప్లై చేసే మద్యంబాటిళ్ల లేబుల్​ను అంటించి వాటిని విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మనుషులను ఎంపిక చేసుకుని..రవాణా చేస్తున్నారు. వివిధ ప్రదేశాల నుంచి పార్సెల్ సర్వీసెస్ ద్వారా పెయింట్ బ్యారెల్​లలో మద్యం బాటిళ్లు ఉంచి పెయింట్ లాగా నమ్మిస్తారు. ఇలా మద్యం రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చంద్రశేఖర్, కలికిరి భూచక్ర, , వేలు, శివలింగం శేఖర్​ను అరెస్టు చేశామని.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి. 'తప్పులు సరి చేసి నూతన జాబితా విడుదల చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.