![పలమనేరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత... ముగ్గురు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8209793_514_8209793_1595954519194.png)
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జంగాలపల్లె చెక్ పోస్టు వద్ద గంగవరం పోలీసులు తనీఖీలు నిర్వహించారు. బొలోరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
గంగవరం పోలీసులు వీరిని విచారించగా రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నట్లు చెప్పారన్నారు. నిందితుల నుంచి 103 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు గంగవరం మేలుమాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా, మరో వ్యక్తి పలమనేరుకు చెందిన వారుగా గుర్తించారు. వీరు ప్రభుత్వం అందించే ఈ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటకలో అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారంతో సిబ్బందితో పలమనేరులోని దుకాణంలో సోదాలు నిర్వహించి 16 రేషన్ బియ్యం మూటలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం రూ.41,650 విలువ చేసే 119 మూటల బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి