ETV Bharat / state

ఉత్సాహభరితంగా 3కే రన్​.. హాజరైన పోలీసు అధికారులు - చిత్తూరు జిల్లా పోలీస్​ 3కె రన్​ న్యూస్​

వచ్చే నెల్లో ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్​ పోలీస్​ డ్యూటీ మీట్​లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన 3కే రన్​ ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

police officers attend 3k run
ఉత్సాహభరితంగా 3 కె రన్​
author img

By

Published : Dec 31, 2020, 2:57 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్​లో భాగంగా నిర్వహించిన త్రీకే రన్ ఉత్సాహ భరితంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి హాజరయ్యారు. జనవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ జరగనుందని డీఐజీ క్రాంతి రాణా టాటా చెప్పారు. మీట్​లో ఏపీ పోలీసు శాఖలోని అన్ని విభాగాలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రధానంగా సైబర్ క్రైమ్, టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఉంటుందని.. విద్యార్థి బృందాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.